చీటి వ్యాపారి పరారీ

ABN , First Publish Date - 2022-07-05T07:20:23+05:30 IST

ఓ చీటి వ్యాపారి రూ.5 కోట్ల వరకు అప్పులు చెల్లించకుండా పరారైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

చీటి వ్యాపారి పరారీ

చిత్తూరు, జూలై 4: ఓ చీటి వ్యాపారి రూ.5 కోట్ల వరకు అప్పులు చెల్లించకుండా పరారైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన ప్రకారం.. చిత్తూరు బజారు వీధికి చెందిన సుబ్రహ్మణ్యం లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చీటీలు వేసేవాడు. ఈ క్రమంలో చీటీలు ఎత్తిన వారు డబ్బులను అడిగితే రోజుల తరబడి వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఆ తరువాత కొంత మంది గట్టిగా నిలదీయడంతో గత నెల 24వ తేది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు కొంత మంది బాధితులు సోమవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతడు దాదాపు రూ.5 కోట్ల వరకు అప్పులు చేసినట్లు చెబుతున్నారు. 

Read more