మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా చంద్రగిరి యువతి

ABN , First Publish Date - 2022-05-18T08:10:14+05:30 IST

చంద్రగిరికి భావన.. మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎంపికయ్యారు.

మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా చంద్రగిరి యువతి
అనంతపురంలో జరిగిన షోలో భావన

చంద్రగిరి, మే 17: చంద్రగిరికి చెందిన గోపికృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె భావన.. మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎంపికయ్యారు. ఈనెల 15వ తేదీన అనంతపురంలో స్వాన్స్‌ ఫోక్‌ క్రియేటివ్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో జరిగిన అతి పెద్ద ఫ్యాషన్‌ రన్‌ వే షోలో ఈమె పాల్గొన్నారు. ఆర్మీలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఈషోను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 400 మంది యువతులు పాల్గొన్నారు. జ్యూరీగా డైరెక్టర్‌ సతీష్‌ అడ్డాల వ్యవహరించారు. ఈ షోలో భావన ఉత్తమ ప్రదర్శన ఇవ్వడంతో ఆమెను మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ.. జూన్‌లో విశాఖలో జరగనున్న ప్రిన్సెస్‌ ఆంధ్రా పోటీల్లో పాల్గొనున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన ఫేమ్‌తో ప్రభుత్వం తరఫున మొక్కల పెంపకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. Read more