భారీ మెజారిటీతో చంద్రబాబు గెలుపే ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-03T05:10:09+05:30 IST

రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామకుప్పం జడ్పీటీసీ మాజీ సభ్యుడు మునస్వామి కోరారు.

భారీ మెజారిటీతో చంద్రబాబు గెలుపే ధ్యేయం
మునస్వామిని సన్మానిస్తున్న నేతలు

రామకుప్పం, అక్టోబరు 2: రానున్న ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామకుప్పం జడ్పీటీసీ మాజీ సభ్యుడు మునస్వామి కోరారు. ఆదివారం పార్టీ మండల కార్యాలయంలో పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికార పార్టీ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గౌనివారితోపాటూ తమపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపించి తీవ్ర మానసిక వేదనకు గురిచేశారన్నారు. ఎన్ని కేసులు బనాయించినా  టీడీపీ నేతలు, కార్యకర్తలు భయపడరాదన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ అధిష్ఠానం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనందరెడ్డి, నరసింహులు, నేతలు ఆంజనేయరెడ్డి, గంట్లరెడ్డి, సలాంసాబ్‌, రామకృష్ణప్ప, మనోహర్‌, చంద్రశేఖర్‌, మంజునాథ్‌, బాబురెడ్డి, సుబ్రహ్మణ్యం, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more