ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా: చల్లాబాబు

ABN , First Publish Date - 2022-09-30T04:41:45+05:30 IST

పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీతో పాటు తాను అండగా ఉంటానని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు.

ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా: చల్లాబాబు
రొంపిచెర్ల మండలం కమ్మపల్లెలో టీడీపీ కార్యకర్తను పరామర్శిస్తున్న బాబురెడ్డి

రొంపిచెర్ల, సెప్టెంబరు 29: పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీతో పాటు తాను అండగా ఉంటానని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన రొంపిచెర్ల మండలంలోని గానుగచింత పంచాయతీ కమ్మపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఎన్‌.రవినాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి  పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్సలు చేయించి, ఆర్థికంగా ఆదుకుంటానని చల్లాబాబు ధైర్యం చెప్పారు.  పార్టీ మండల అధ్యక్షుడు ఉయ్యాల రమణ, నాయకులు కృష్ణమనాయుడు, శంకర్‌నాయుడు, శేషాద్రినాయుడు, హరికృష్ణ, శశికుమార్‌, విజయ్‌, ముద్దుకృష్ణ, అమరనాథరెడ్డి పాల్గొన్నారు. 

Read more