పోస్టు ఆఫీసులో నగదు పొదుపు

ABN , First Publish Date - 2022-11-12T02:15:27+05:30 IST

కేంద్రం ఇండియన్‌ పోస్టు ఆఫీసుల్లో నగదు పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పోస్టు ఆఫీసులో నగదు పొదుపు

తిరుపతి(కొర్లగుంట), నవంబరు 11: కేంద్రం ఇండియన్‌ పోస్టు ఆఫీసుల్లో నగదు పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నతరహా నుంచి పెద్ద తరహా వరకు పొదుపుతో పాటు రూ. 1.5లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు సౌకర్యం ఉంటుంది. సేవింగ్స్‌ బ్యాంకు పథకాలు, ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి పథకం, పీ.ఎల్‌.ఐ, ఆర్‌.పీ.ఎల్‌.ఐ వంటి భీమా పథకాలు, ప్రధాన మంత్రి సురక్ష, జీవన్‌జ్యోతి యోజన భీమాయోజన, జన్‌ సురక్ష, పెన్షన్‌ పథకాలు, ఇండియన్‌ పోస్టు చెల్లింపు బ్యాంక్‌, ఎస్బీ ఖాతాలు, సాధారణ భీమా, గ్రూప్స్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ భీమా తదితరాలున్నాయి.

Updated Date - 2022-11-12T02:15:27+05:30 IST

Read more