అంబులెన్స్‌ నిర్వాహకులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-09-24T06:08:47+05:30 IST

స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వహకులపై కేసు నమోదు చేసినట్టు 1వ పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపారు.

అంబులెన్స్‌ నిర్వాహకులపై కేసు నమోదు

గూడూరు, సెప్టెంబరు 23: స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వహకులపై కేసు నమోదు చేసినట్టు 1వ పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం కోట మండ లం తిమ్మనాయుడుకండ్రిగకు చెందిన మణికంఠ మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద నుంచి స్వగ్రామానికి తరలించే విషయంలో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించడంతో మణికంఠ కుటుంబ సభ్యులైన మణి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ రాముతోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read more