ప్రభుత్వ భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-10-02T05:18:33+05:30 IST

ఇంకా ప్రారంభం కాని ఆర్బీకే, హెల్త్‌క్లీనిక్‌, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు.

ప్రభుత్వ భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 1: ఇంకా ప్రారంభం కాని ఆర్బీకే, హెల్త్‌క్లీనిక్‌, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలను  వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజినీర్లతో ఆయన సమీక్షించారు. కోర్టు వివాదాల్లో ఉన్నవి మినహా మిగిలిన అన్ని చోట్ల వచ్చే శనివారంలోగా 22 భవనాలకు స్లాబ్‌లు వేయాలని, 25వ తేదీలోగా బేస్మెంట్‌ స్థాయి దాటాలని ఆదేశించారు. గత నెలలో 26 గ్రామ సచివాలయ, 21 ఆర్బీకే, 15 వైఎస్సార్‌ హెల్త్‌క్లీనిక్‌ భవన నిర్మాణాలు పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. అక్టోబరులో 13 బీఎంసీయూలు, 184 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. 

Read more