దేశాన్ని బీజేపీ, రాష్ర్టాన్ని వైసీపీ అప్పులపాలు చేశాయి

ABN , First Publish Date - 2022-12-13T23:59:46+05:30 IST

దేశాన్ని కేంద్రంలోని బీజేపీ, ఏపీని వైసీపీ అప్పుల పాలు చేశాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌రెడ్డి అన్నారు.

దేశాన్ని బీజేపీ, రాష్ర్టాన్ని వైసీపీ అప్పులపాలు చేశాయి
మీడియాతో మాట్లాడుతున్న రాకేశ్‌రెడ్డి

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ రెడ్డి

తిరుపతి అర్బన్‌, డిసెంబర్‌ 13: దేశాన్ని కేంద్రంలోని బీజేపీ, ఏపీని వైసీపీ అప్పుల పాలు చేశాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మూడు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారిపోయాయని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.లక్ష కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు దాన్ని రూ.3 లక్షల కోట్లకు, జగన్‌ రూ.8లక్షల కోట్లకు చేర్చారని పేర్కొన్నారు. అప్పులు తప్ప అభివృద్ధి లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి, విభజనచట్టంలోని హామీను అమలు చేస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పన్ను రాయితీలను కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మాండస్‌ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 1 లక్ష నష్ట పరిహారం, ఇల్లు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన కరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌ రెడి ్డ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ గౌడపేరు చిట్టిబాబు, పీసీసీ సభ్యులు సిద్ధయ్య, ప్రభాకర్‌, నటరాజ, మొదలియార్‌, డీసీసీ కార్యదర్శులు డిల్లీ, దేశయ్య, చిరంజీవి రెడ్డి, సతీష్‌, ధర్మలింగం, యువజన కాంగ్రెస్‌ నాయకులు ప్రేమ్‌సాగర్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:59:46+05:30 IST

Read more