‘డైట్‌’లో అభివృద్ధి పనులకు భూమిపూజ

ABN , First Publish Date - 2022-06-07T07:03:52+05:30 IST

కార్వేటినగరంలో రూ.4.57 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ చేశారు.

‘డైట్‌’లో అభివృద్ధి పనులకు భూమిపూజ
ప్రభుత్వ డైట్‌ లో భూమిపూజ

కార్వేటినగరం, జూన్‌ 6: కార్వేటినగరంలో రూ.4.57 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ చేశారు. స్థానిక డైట్‌లో రూ.కోటితో పనులు చేపట్టనున్నారు. జడ్పీ బాలికల హైస్కూల్‌లో రూ.63 లక్షలు, గుంట ప్రైమరీ స్కూల్‌ రూ.16 లక్షలు, బీసీ కాలనీ స్కూల్‌లో రూ.12 లక్షలతో మౌలిక వసతులు సమకూరుస్తారు. అర్‌కేవీబీ పేట గ్రామంలోని సీతాలమ్మ గుంటలో రూ.40 లక్షలతో పుష్కరిణి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ హరినారాయణన్‌, జడ్పీ సీఇవో ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీటీసీ పరంజ్యోతి, ఎంపీపీ లతా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Read more