పూతలపట్టు టీడీపీ నేతలకు బెయిల్‌

ABN , First Publish Date - 2022-09-10T06:15:21+05:30 IST

పూతలపట్టు మండల టీడీపీ నేతలు శుక్రవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చారు.

పూతలపట్టు టీడీపీ నేతలకు బెయిల్‌
జిల్లా జైలు వద్ద టీడీపీ నేతలకు ఘన స్వాగతం

చిత్తూరు సిటీ, సెప్టెంబరు 9: పూతలపట్టు మండల టీడీపీ నేతలు శుక్రవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చారు. నెల కిందట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబును ప్రజాసమస్యలపై ప్రశ్నించడంతో వైసీపీ, టీడీపీ శ్రేణులకు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు బి.హేమాద్రి, టి.జయప్రకాష్‌, బి.మహేష్‌, వి.యువరాజులు, వి.మునీంద్ర, బి.జగదీష్‌ కుమార్‌, వి.జయప్రకాష్‌, డి.కిషోర్‌ కుమార్‌, వి.గోపి చంద్‌, పురుషోత్తంపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. శుక్రవారం వీరికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో జిల్లాలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు చిత్తూరులోని జైలు వద్దకు భారీగా చేరుకుని వారిని పుష్పగుచ్ఛాలు, శాలువలతో ఘనంగా స్వాగతం పలికారు.మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more