బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-02-20T05:27:39+05:30 IST

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని శ్రీకాళహస్తి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి అరుణ సూచించారు.

బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలి
సభలో ప్రసంగిస్తున్న జడ్జి అరుణ

ఏర్పేడు, ఫిబ్రవరి 19: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని శ్రీకాళహస్తి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి అరుణ సూచించారు. శనివారం మండలంలోని బత్తినయ్యకాలనీలో న్యాయ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్న వయసులో వివాహాలు చేస్తే బాలికలు అనారోగ్యం బారినపడతారని చెప్పారు. పుట్టే పిల్లల ఎదుగుదల ఆగిపోతుందని గుర్తుచేశారు. కొవిడ్‌ అడ్డుకట్టకు అందరూ మాస్కులు ధరించాలని కోరారు. న్యాయపరమైన సమస్యలపై నెం.15100కు ఫోన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామచంద్రయ్య, ఏఎస్‌ఐ హబీబుల్లా, సర్పంచ్‌ నిర్మల, ప్రజాప్రగతి సంస్థ కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, నాయకులు చందమామల కోటయ్య, ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more