ఆపస్‌ నూతన కార్యవర్గాలు ఎన్నిక

ABN , First Publish Date - 2022-04-25T05:24:03+05:30 IST

ఏపీ ఉపాధ్యాయ సంఘం తిరుపతి, చిత్తూరు జిల్లాల నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆపస్‌ నూతన కార్యవర్గాలు ఎన్నిక

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 24: ఏపీ ఉపాధ్యాయ సంఘం తిరుపతి, చిత్తూరు జిల్లాల నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం బైరాగిపట్టెడలోని ఆ సంఘం కార్యాలయంలో రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలాజీ నేతృత్వంలో ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా టి.నాగరాజు (తొట్టంబేడు మండలం), ప్రధాన కార్యదర్శిగా జి.శాంతిరెడ్డి (రేణిగుంట), కోశాధికారిగా రంజిత్‌కుమార్‌ (నాగలాపురం), చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మంజునాథ్‌గుప్తా, ప్రధాన కార్యదర్శిగా దొరస్వామి, కోశాధికారిగా ధనంజయలను ఎన్నుకున్నారు. నాయకులు సుబ్రహ్మణ్యం, నీలకంఠంనాయుడు, దివాకర్‌, సుభాష్‌చంద్రదాస్‌, రాజేశ్వరి, చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. 


Read more