టీటీడీకి విరాళంగా అపార్ట్‌మెంట్‌

ABN , First Publish Date - 2022-09-25T07:26:47+05:30 IST

తిరుపతికి చెందిన కుందవరం చలపతిబాబు టీటీడీకి తన ఇంటిని విరాళంగా అందజేశారు.

టీటీడీకి విరాళంగా అపార్ట్‌మెంట్‌
రిజిస్ర్టేషన్‌ పత్రాలు చైర్మన్‌కు అందజేస్తున్న చలపతిబాబు

తిరుమల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో దాదాపు 38 ఏళ్లపాటు విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి.. శ్రీవారిపై ఉన్న భక్తితో టీటీడీకి తన ఇంటిని విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన కుందవరం చలపతిబాబు 1979 నుంచి 2017 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేసి డిప్యూటీ ఈవో హోదాలో పదవీ విరమణ చేశారు. కాగా, స్వామిపై భక్తితో తన పేరుపై తిరుచానూరులో ఉన్న సుమారు రూ.50 లక్షల విలువైన అపార్టుమెంట్‌ను టీటీడీకి విరాళంగా ఇవ్వాలని భావించారు. ఈమేరకు టీటీడీ పేరుపై రిజిస్ర్టేషన్‌ చేసి ఆ పత్రాలను   చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. 

Read more