AP News: ఏపీ సర్కార్ రూ.8 లక్షల కోట్లు అప్పు చేసింది: లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-09-30T02:54:25+05:30 IST

Tirupati: తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాజధాని అంశాన్ని అటక్కెక్కించి.. అమరావతి రైతులపై కత్తి కట్టారని ఆరోపించారు. జగన్ వైఖరి వల్లే విభజన చ

AP News: ఏపీ సర్కార్ రూ.8 లక్షల కోట్లు అప్పు చేసింది: లక్ష్మణ్

Tirupati: తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాజధాని అంశాన్ని అటక్కెక్కించి.. అమరావతి రైతులపై కత్తి కట్టారని ఆరోపించారు. జగన్ వైఖరి వల్లే విభజన చట్టం నీరుగారిపోతోందని, ఏపీ సర్కార్ రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. జగన్ విధానపరమైన నిర్ణయాలు ఏపీకి శాపంగా మారాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి కూడా లక్ష్మణ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఎన్నో పార్టీలు వచ్చాయి.. టూలెట్ బోర్డులు పెట్టుకున్నాయని, కేసీఆర్ 4 ఏళ్లుగా జాతీయ పార్టీ, ఫ్రంట్ పేరుతో ఉవిళ్లూరుతున్నారని పేర్కొన్నారు. ప్రజల డబ్బు, నల్లధనంతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, కుటుంబ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని విమర్శించారు. 


Read more