కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

ABN , First Publish Date - 2022-02-19T07:42:00+05:30 IST

కల్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరగనుంది.

కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

చంద్రగిరి, ఫిబ్రవరి 18: చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురంలో ఉన్న కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరగనుంది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఆదివారం నుంచి ఈనెల 28వ తేదీవరకు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి 9.20 గంటల మఽధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది.కాగా బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని ఆలయాధికారులు, అర్చకులు శుక్రవారం ఆహ్వానించారు. డిప్యూటీ ఈవో శాంతి, అర్చకులు బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ ముని చెంగల్రాయులు తదితరులు పాల్గొన్నారు. 

Read more