-
-
Home » Andhra Pradesh » Chittoor » Ankurarpana for consecrations in Ammavari temple-NGTS-AndhraPradesh
-
అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ABN , First Publish Date - 2022-09-08T06:38:51+05:30 IST
పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

తిరుచానూరు, సెప్టెంబరు 7: పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలి రోజున పవిత్రప్రతిష్ట, రెండోరోజున పవిత్ర సమర్పణ, చివరిరోజున పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ. 750ఆర్జితం చెల్లించి ఒక రోజు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2లడ్డూలు, 2వడలు బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో లోకనాధం, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దామోదరం తదితరులు పాల్గొన్నారు.