శాస్త్రోక్తంగా అమావాస్య ఉత్సవం

ABN , First Publish Date - 2022-01-03T06:33:33+05:30 IST

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా అమావాస్య ఉత్సవం నిర్వహించారు.

శాస్త్రోక్తంగా అమావాస్య ఉత్సవం
స్వామి, అమ్మవార్ల ఊరేగింపు

శ్రీకాళహస్తి, జనవరి 2: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా అమావాస్య ఉత్సవం నిర్వహించారు. తొలుత వేద పండితులు ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలురకాల అభిషేకాలు జరిపించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను చప్పరంపై అధిష్టించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల సందడి నడుమ పురవీధుల్లో ఊరేగించారు. తరలి వచ్చిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, ఏఈవో ధనపాల్‌, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more