తిరుపతిలో ఆదిలాబాద్‌ వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-17T07:00:57+05:30 IST

తెలంగాణకు చెందిన ఒక వృద్ధుడు తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తిరుపతిలో ఆదిలాబాద్‌ వృద్ధుడి ఆత్మహత్య
ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వృద్ధుడు, అతడి వద్ద లభించిన పాస్‌పోర్ట్‌ ఫొటోలు

ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలని పోలీసుల వినతి


తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 16 : తెలంగాణకు చెందిన ఒక వృద్ధుడు తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని వేశాలమ్మ గుడి వీధిలో మున్సిపల్‌ మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ వెనుక ఉన్న ఖాళీస్థలంలో ఓ కొయ్యకు ఉరి వేసుకున్నాడు. తెల్ల చొక్కా, ధోవతి ధరించి ఉన్న వృద్ధుడి వయసు 60-65 సంవత్సరాల మధ్య ఉంటుంది. సమాచారం అందుకున్న వెస్ట్‌ ఎస్‌ఐ చలపతి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతనివద్ద వివరాలేమీ లభ్యం కాలేదు.జేబులో ఐదు పాస్‌పోర్ట్‌ ఫొటోలు మాత్రం లభ్యమయ్యాయి. అందులో ఓ వృద్ధుడు, ఓ నడివయసు వ్యక్తి, మరో ఇద్దరు యువకులు, ఓ చిన్నపిల్లవాడి ఫొటోలు ఉన్నాయి. ఈనెల 12వ తేదీన ఆయన ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని ముద్ఖేడ్‌కు ప్రయాణం చేసిన రైలు టికెట్‌తోపాటు 13వ తేదీన నిజామాబాద్‌ నుంచి తిరుపతికి వచ్చిన రైలు టికెట్‌ ఉన్నాయి. మృతుడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌కు లేదా మహారాష్ట్ర ముద్ఖేడ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.అతడివద్ద లభించిన ఫొటోలు కుటుంబసభ్యులవి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మృతుని గురించిన సమాచారం ఉన్నవారు 05772289008నెంబర్‌కు ఫోన్‌చేసి వెస్ట్‌ పోలీసు స్టేషన్‌కు, 9440796750 నెంబర్‌లో ఎస్‌ఐ చలపతికి, 9492707027 నంబర్‌లో సీఐ శివప్రసాద్‌కు సమాచారం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Read more