డీవీఈవోగా స్వర్ణలత బాధ్యతల స్వీకారం

ABN , First Publish Date - 2022-04-05T06:35:22+05:30 IST

తిరుపతి నూతన వృత్తివిద్యాశాఖాధికారి(డీవీఈవో)గా నాగలాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ స్వర్ణలత నియమితులయ్యారు.

డీవీఈవోగా స్వర్ణలత బాధ్యతల స్వీకారం
స్వర్ణలతను అభినందిస్తున్న ఆర్‌ఐవో, ఉద్యోగులు

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 4: తిరుపతి నూతన వృత్తివిద్యాశాఖాధికారి(డీవీఈవో)గా నాగలాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ స్వర్ణలత నియమితులయ్యారు. ఈమేరకు ప్రాంతీయ ఇంటర్‌బోర్డు కార్యాలయంలో సోమవారం ఉదయం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీవీఈవోగా పనిచేసిన వి.శ్రీనివాసులురెడ్డిని చిత్తూరు డీవీఈవోగా నియమిస్తూ బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీశారు. కాగా.. తిరుపతి, చిత్తూరు జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా(ఆర్‌ఐవో)గా వై.వెంకటరెడ్డి వ్యవహరిస్తారు. ఈసందర్భంగా కొత్త డీవీఈవోను ఆర్‌ఐవోతోపాటు ఉద్యోగులు మాధవరావు తదితరులు అభినందించారు. 


డీఈవోగా శేఖర్‌ 

తిరుపతి విద్యాశాఖాధికారి(డీఈవో)గా డాక్టర్‌ వి.శేఖర్‌ సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు చిత్తూరు డీఈవో ఉన్న ఆయన్ను తిరుపతికి మార్చారు.  ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, సమగ్ర శిక్షా అధికారి పి.వెంకటరమణారెడ్డిల సమక్షంలో కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో శేఖర్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్జేడీతో కలిసి తిరుచానూరులోని జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి, టెన్త్‌ విద్యార్థులతో ముచ్చటించారు. కాగా.. విద్యాశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పి.రఘురామయ్య, పీవీఎస్‌ లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్లుగా వి.సురే్‌షకుమార్‌, జి.సురేష్‌, ఏపీవోగా వై.ప్రేమ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్లుగా వి.నందకుమార్‌, ఎంకే కృష్ణారావు, డి.వెంకటేశ్వరరావు, పి.వాసుదేవరెడ్డి, టైపిస్టులుగా ఎన్‌.కుమార్‌, ఎం.రెడ్డితీర్థనాయక్‌, జూనియర్‌ అసిస్టెంట్లుగా ఎస్‌.మధు, జి.రేణుకాపతి, సబార్డినేట్‌గా టి.వైశాలినిలను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

Updated Date - 2022-04-05T06:35:22+05:30 IST