-
-
Home » Andhra Pradesh » Chittoor » ACB searches at the tehsildar office-NGTS-AndhraPradesh
-
తహసీల్దారు కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ABN , First Publish Date - 2022-06-07T06:48:53+05:30 IST
తవణంపల్లె తహసీల్దార్ కార్యాయలంలో సోమవారం ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జనార్దననాయుడు ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు జరిగాయి.

తవణంపల్లె, జూన్ 6: తవణంపల్లె తహసీల్దార్ కార్యాయలంలో సోమవారం ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జనార్దననాయుడు ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు జరిగాయి. కొంతకాలంగా తహసీల్దార్ కార్యాయలంలో పైసలివ్వందే పనులు చేయడం లేదని అవినీతికి పాల్పడుతూ ప్రజలను వేధిస్తున్నారన్న ఫిర్యాదులపై ఈ తనిఖీలు జరిపారు. రికార్డులను తనిఖీ చేసి అధికారులను ప్రశ్నించారు. రైతులకు మంజూరైన ఈ-పాస్ పుస్తకాలను రైతులకు ఇవ్వకుండా కార్యాలయంలోనే ఉంచుకోవడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. అరగొండ- చిత్తూరు రహదారి పక్కన పట్నం, సత్తారు బావి, ముత్తరపల్లె తదితర ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూమిని కొందరు రెవెన్యూ అధికారుల అండదండలతో కొంత కబ్జా చేశారని పలువురు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ జనార్దననాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆక్రమాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేపట్టామన్నారు. ఈ-పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకొని.. అవి మంజూరైతే రైతులకు ఇవ్వకుండా కార్యాలయంలోనే ఉంచుకొన్నట్లు గుర్తించామన్నారు. తాము సోదాల్లో గుర్తించిన అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. ఈ సోదాల్లో ఏసీబీ సీఐలు ప్రతా్‌పరెడ్డి, ఈశ్వర్, నాగేంద్ర, సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.