మల్బరీ తోటలో ఏనుగుల గుంపు

ABN , First Publish Date - 2022-11-25T00:03:12+05:30 IST

పలమనేరు పట్టణ పరిసరాల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతోంది. గురువారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో బేరుపల్లి వద్ద మల్బరీ తోటలో నాలుగు ఏనుగులు కనిపించాయి.

మల్బరీ తోటలో ఏనుగుల గుంపు
పలమనేరు సమీపంలోని మల్బరీ తోటలో ఏనుగులు

పలమనేరు, నవంబరు 24: పలమనేరు పట్టణ పరిసరాల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతోంది. గురువారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో బేరుపల్లి వద్ద మల్బరీ తోటలో నాలుగు ఏనుగులు కనిపించాయి. దీంతో ఆ గ్రామస్థులు ఆందోళన చెందారు. వెంటనే యువకులు పెద్ద ఎత్తున కేకలు పెడుతూ వెళ్లడంతో ఏనుగులు పరుగులు తీసుకొంటూ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం వైపు వెళ్లాయి. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మిదొడ్డి గ్రామ సమీపంలో వరి, టమోటా పంటలను బుధవారం ధ్వంసం చేసిన ఏనుగులు.. ఈ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బేరుపల్లికు రావడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-11-25T00:03:12+05:30 IST

Read more