ఈఎంసీలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల బృందం

ABN , First Publish Date - 2022-10-14T06:26:45+05:30 IST

ప్రస్తుతం శిక్షణలో వున్న 2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది.

ఈఎంసీలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల బృందం 

 తిరుపతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం శిక్షణలో వున్న 2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. అమృత్‌ కాల్‌ బ్యాచ్‌గా పేరుపడిన ఈ బ్యాచ్‌కు సంబంధించి తొమ్మిదిమందితో కూడిన ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్లు ఆంధ్ర దర్శన్‌లో భాగంగా బుధవారం జిల్లాకు వచ్చారు. గురువారం వేకువజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న వీరు అనంతరం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో విస్తరించి వున్న ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌-2లో పర్యటించారు.డిక్సన్‌ మొబైల్స్‌ కంపెనీని సందర్శించారు.ఈఎంసీ కార్యాలయంలో సీఈవో గౌతమిని కలుసుకుని ఎలకా్ట్రనిక్స్‌ క్లస్టర్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ప్రతాప్‌, ఏపీఐఐసీ తిరుపతి జోనల్‌ మేనేజర్‌ సోనీ, తిరుపతి స్పెషల్‌ జోన్‌ ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల బృందంలో పి.ధాత్రీ రెడ్డి, వై.మేఘ స్వరూప్‌, ప్రఖర్‌ జైన్‌, గొబ్బిల్ల విద్యాధరి, శివ్‌ నారాయణ్‌ శర్మ, అశుతోష్‌ శ్రీవాత్సవ్‌, అపూర్వ భరత్‌, రాహుల్‌ మీనా, సూరపాటి ప్రశాంత్‌ కుమార్‌ వున్నారు.

Read more