వైభవంగా శ్రీవారి గొడుగుల ఊరేగింపు

ABN , First Publish Date - 2022-09-24T06:50:47+05:30 IST

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చెన్నై నుంచి విశ్వహిందూ పరిషత్‌ అధ్వర్యంలో తీసుకొచ్చిన శ్రీవారి గొడుగులకు పుత్తూరులో ఘనస్వాగతం లభించింది.

వైభవంగా శ్రీవారి గొడుగుల ఊరేగింపు

పుత్తూరు, సెప్టెంబరు 23: శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చెన్నై నుంచి విశ్వహిందూ పరిషత్‌ అధ్వర్యంలో తీసుకొచ్చిన శ్రీవారి గొడుగులకు పుత్తూరులో ఘనస్వాగతం లభించింది.ఆర్‌డీఎం రైల్వే గేటు వద్ద గొడుగులతో పాటు శ్రీవారి పాదుకలకు  వీహెచ్‌పీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం  పట్టణంలో మేళాతాళాల మధ్య ఊరేగించారు.బీజేపీ అధికార ప్రతినిధి నిషిధ సురేంద్ర రాజు, కోటకొండ బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ హరి, వీహెచ్‌పీ నాయకులు మేకల సుబ్రహ్మణ్యం, పేట బాలకృష్ణారెడ్డి, బాలాజీ, రవిశేఖర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Read more