ప్రజలపై పెనుభారం వేసిన సీఎంకు పాలించే అర్హత లేదు

ABN , First Publish Date - 2022-04-05T06:08:56+05:30 IST

ప్రజలపై పెనుబారం వేసిన సీఎం జన్‌కు పాలించే అర్హత లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలకు నిరసనగా పలమనేరులో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

ప్రజలపై పెనుభారం వేసిన సీఎంకు పాలించే అర్హత లేదు
పలమనేరులో సోమవారం మాజీ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ

పలమనేరు, ఏప్రిల్‌ 4: ప్రజలపై పెనుబారం వేసిన సీఎం జన్‌కు పాలించే అర్హత లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలకు నిరసనగా  పలమనేరులో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా  జాతీయ రహదారిపై జరిగిన ధర్నాలో అమర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో మాట తప్పి, మడమ తిప్పే వ్యక్తి ఏవరైనా వున్నారా అంటే అది జగన్‌ ఒక్కరే అని అందుకు ఆయనకు పేటెంట్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు మీ మాట విని, నడచుకొని కోర్టులో చీవాట్లు తిని చివరకు జడ్జీలకు వంగివంగి దండాలు పెట్టి తమను మన్నించాలని ప్రాధేయపడి పరిస్థితి వచ్చిందన్నారు.  ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా వుందా అన్నారు. చెత్తపై పన్నులు వేసి, రిజిస్ట్రేషన్‌, ఆస్థి పన్నులు పెంచి ప్రజల నడ్డివిరిచి చివరకు రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఇక ఇసుకకు మహాన్నతమైన శాండ్‌ పాలసీ తీసుకువస్తామని గతంలో రూ.750 ధరవున్న ట్రాక్టరు నేడు రూ.5వేలకు  ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ప్రజలపై మూడేళ్లలో ఎన్ని విధాలుగా భారం మోపారో ఆయన పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైనా గుర్తున్నాయా అని ప్రశ్నించారు. ఏమైన గుర్తుందా అన్నారు.  గడచిన మూడేళ్లలో ప్రజలనుంచి వసూలు చేసిన రూ.16,611 కోట్లు, భారం వేయలేదా... అలాగే విద్యుత్‌ సంస్థలను అడ్డుపెట్టుకొని వాటిని గ్యారెంటీగా చూపి రూ.26 వేల కోట్లు  ఏమయ్యాయో ప్రజలకు వివరించాలన్నారు.  ఆనాడు 200 యూనిట్లు వాడితే చెల్లిస్తున్న శ్లాబులోకి నేడు 75 యూనిట్లు శ్లాబులోకి తీసుకొచ్చారన్నారు. రైతుల ట్రాన్స్‌ఫారం కాలిపోతే కొత్తది ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చివరకు  ఫ్యూజు వైరు కోసం విద్యుత్‌ శాఖ సిబ్బంది వెతుక్కునే పరిస్థితి తలెత్తిందన్నారు.  ఆర్బీసీ కుట్టి, సోమశేఖర్‌, వీరప్ప, అమ్ములు, జగదీష్‌నాయుడు, గిరిబాబు, ఖాజాపీర్‌, సుబ్రమణ్యంగౌడు, సుమారు 400 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-04-05T06:08:56+05:30 IST