అదుపు తప్పి దుకాణాల్లో దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2022-04-24T05:58:10+05:30 IST

అదుపు తప్పిన కారు దుకాణాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఏర్పేడు మండలం పాపానాయడుపేటలో శనివారం చోటు చేసుకుంది.

అదుపు తప్పి దుకాణాల్లో దూసుకెళ్లిన కారు
ప్రమాదానికి కారణమైన కారు, చెల్లాచెదరైన కూరగాయలు

ముగ్గురికి గాయాలు


ఏర్పేడు, ఏప్రిల్‌ 23: అదుపు తప్పిన కారు దుకాణాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఏర్పేడు మండలం పాపానాయడుపేటలో శనివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీహరి కథనం మేరకు... బెంగళూరుకు చెందిన నారాయణ కుటుంబ సభ్యులు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వరుడిని దర్శించుకోవడానికి బయలుదేరారు. పాపానాయుడుపేటలో వీరి కారు అదుపు తప్పి దుకాణాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన దుకాణం వద్ద ఉన్న పాపానాయుడుపేటకు చెందిన జయమ్మ, యూసఫ్‌, సరస్వతి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more