ట్రాక్టర్‌ ఢీకొని బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-10-05T04:40:02+05:30 IST

వి.కోట మండలంలోని నాయకనేరి-వి.కోట ప్రధాన రహదారిలో ఆళ్లవారిపల్లె క్రాస్‌ వద్ద ట్రాక్టర్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో బాలుడు మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడింది.

ట్రాక్టర్‌ ఢీకొని బాలుడి మృతి
ఘటనా స్థలంలో గోపినాథ్‌ ఒడిలో భార్య, వెనుక బాలుడి మృతదేహం

తల్లికి తీవ్రగాయాలు


వి.కోట, అక్టోబరు 4: మండలంలోని నాయకనేరి-వి.కోట ప్రధాన రహదారిలో ఆళ్లవారిపల్లె క్రాస్‌ వద్ద  ట్రాక్టర్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో బాలుడు మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడింది. చిత్తూరు సచివాలయ ఉద్యోగి గోపినాథ్‌ మంగళవారం మధ్యాహ్నం భార్యా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో ద్విచక్రవాహనంపై స్వగ్రామమైన వి.కోట మండలం బాలింతరాళ్లబండ నుంచి వి.కోట పట్టణానికి వస్తుండగా ఆళ్లవారిపల్లె క్రాస్‌ సమీపంలో ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో చేహన్‌(7) దుర్మరణం చెందగా,  ఝాన్సీ తీవ్రంగా గాయపడింది. కుమార్తెలు సహా గోపినాథ్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు.  స్థానికులు 108 అంబులెన్స్‌ సమాచారం అందించగా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కుప్పం పీఈఎస్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. సీఐ ప్రసాద్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Read more