68 బస్సు సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2022-12-13T01:58:05+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావం ఆర్టీసీపై కొనసాగుతోంది. సోమవారం కూడా 68 సర్వీసులను అధికారికంగా రద్దు చేశారు.

 68 బస్సు సర్వీసుల రద్దు
తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండులో ఆపేసిన బస్సులు

తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ ప్రభావం ఆర్టీసీపై కొనసాగుతోంది. సోమవారం కూడా 68 సర్వీసులను అధికారికంగా రద్దు చేశారు. తిరుపతిడిపో పరిధిలో 28, అలిపిరిలో 18 (తిరుమలవెళ్లే బస్సులు తగ్గించారు), పుత్తూరులో ఐదు, సత్యవేడులో రెండు, గూడూరులో ఎనిమిది, వాకాడులో మూడు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరుమలలోనూ ప్రతికూల వాతావరణం కారణంగా టీటీడీ ఆదేశాల మేరకు పాపవినాశనం, శ్రీవారి పాదాల మధ్య రాకపోకలు సాగించే ఎనిమిది సర్వీసులను ఖాళీగా పెట్టకుండా తిరుపతి-తిరుమల మధ్య నడిపారు. ఆదివారం 88 బస్సులు రద్దవడంతో ఆదాయంపై ప్రభావం స్పష్టంగా కనబడింది.

11వ తేదీ నమోదైన వివరాలిలా..

విజయవాడ ప్రధాన కార్యాలయం జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌లో భాగంగా ఆదాయం రూ.1.73 కోట్లుకాగా.. రూ.1.35 కోట్లు మాత్రమే లభించింది. బస్సులు 3.54 లక్షలకు 2.96లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఆక్యుపెన్సీ రేషియో 68కిగాను 63శాతం నమోదైంది. ఈపీకే కూడా రూ.49కాగా రూ.46మాత్రమే వచ్చింది.

Updated Date - 2022-12-13T01:58:05+05:30 IST

Read more