654 లీటర్ల మద్యం బాటిళ్ల ధ్వంసం

ABN , First Publish Date - 2022-11-08T00:32:19+05:30 IST

వివిధ కేసుల్లో పట్టుబడ్డ 654 లీటర్ల మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు సెబ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తెలిపారు.

654 లీటర్ల మద్యం బాటిళ్ల ధ్వంసం

నాయుడుపేట టౌన్‌: వివిధ కేసుల్లో పట్టుబడ్డ 654 లీటర్ల మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు సెబ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తెలిపారు. పెళ్లకూరు మండలం శిరసనం బేడు అటవీ ప్రాంతంలో సోమవారం మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. 153 కేసుల్లో 2,765 బాటిళ్ల 654 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ధ్వంసమైన మద్యం విలువ రూ.3,62,984 ఉంటుందని తెలిపారు. సెబ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ జానకిరామ్‌, నాయుడుపేట సెబ్‌ సీఐ ఆర్‌యువిఎస్‌ ప్రసాద్‌, సెబ్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-11-08T00:32:19+05:30 IST

Read more