వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

ABN , First Publish Date - 2022-10-03T05:58:58+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనానికి ఆదివారం నాలుగు గంటల సమయం పట్టింది.

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
స్వామి దర్శనార్థం వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), అక్టోబరు 2: కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనానికి ఆదివారం నాలుగు గంటల సమయం పట్టింది. సెలవు కావడంతో ఉదయం నుంచే ఆలయంలో భక్తుల సందడి మొదలైంది. వేలాదిగా వచ్చిన భక్తులతో క్యూలన్నీ పూర్తిగా నిండిపోయాయి. క్యూలలో భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు అందించారు.


Read more