వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు

ABN , First Publish Date - 2022-09-11T05:44:29+05:30 IST

కాణిపాక ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు విచ్చేశారు.

వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు
స్వామి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 10: కాణిపాక ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు విచ్చేశారు. క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. క్యూలలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఈఈ వెంకటనారాయణ పరిశీలించారు. నూతన ఆలయ క్యూలైన్లలో స్వల్ప మార్పులు తెస్తే ఎంతరద్దీ వచ్చినా భక్తులకు ఇబ్బందులు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. 

Read more