206 ‘జలకళ’ పనులు మంజూరు

ABN , First Publish Date - 2022-03-23T06:40:31+05:30 IST

జలకళ పథకం కింద జిల్లాకు 206 పనులు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి తెలిపారు.

206 ‘జలకళ’ పనులు మంజూరు
సమావేశంలో మాట్లాడుతున్న సదరన్‌ డిస్కం ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి

చిత్తూరు రూరల్‌, మార్చి 22: జలకళ పథకం కింద జిల్లాకు 206 పనులు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి తెలిపారు. చిత్తూరులో మంగళవారం ఆయన ఈఈలు, డీఈలతో సమావేశమయ్యారు. ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోరు, విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తామన్నారు. ఈ 206 పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలన్నారు. 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న 13వేల వ్యవసాయ సర్వీసులను సీనియారిటీ వారీగా ఇస్తామన్నారు. ఈ సమావేశంలో డీఈలు మునిచంద్ర, శేషాద్రి, జ్ఞానేశ్వర్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


తిరుపతిలోనే ఎస్‌ఈ కార్యాలయం

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయం తిరుపతిలోనే కొనసాగుతుందని ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా విభజన నేపథ్యంలో ఎస్‌ఈ కార్యాలయం చిత్తూరుకు వస్తుందనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఇప్పటిలానే డివిజన్లు, అధికారులు యథాస్థానంలో కొనసాగుతారని, తిరుపతి నుంచే మూడు జిల్లాలను పర్యవేక్షిస్తామన్నారు.

Read more