జిల్లా విభజనపై 145 వినతులు

ABN , First Publish Date - 2022-02-23T07:00:57+05:30 IST

కొత్త జిల్లాలపై మంగళవారం నాటికి కలెక్టరేట్‌కు 145 అభ్యంతరాలు, సూచనలు అందాయి.

జిల్లా విభజనపై 145 వినతులు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 22: ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలపై మంగళవారం నాటికి కలెక్టరేట్‌కు 145 అభ్యంతరాలు, సూచనలు అందాయి. వీటిల్లో.. శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలంటూ 11, పుంగనూరు నియోజవర్గాన్ని మదనపల్లెలో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని 3, తంబళ్లపల్లె, మదనపల్లె తదితర నియోజక వర్గాలను అన్నమయ్య జిల్లాలో కాకుండా కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేసి, అందులో కలపాలని 15 వినతులు అందాయి. నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి బాలాజీ జిల్లాలో కలపాలని 100పైగా వినతులు అందగా.. వడమాలపేట, నగరి, నిండ్ర, విజయపురం మండలాలను బాలాజీ జిల్లాలో విలీనం చేయాలంటూ 16 వినతులు అందాయని అధికారులు వివరించారు. కాగా.. జిల్లాల ఏర్పాట్లలో భాగంగా కలెక్టరేట్‌ రెవెన్యూ విభాగంలో ఉన్న రికార్డులను మండలాల వారీగా త్వరగా ఫైళ్లు తయారు చేయాలని జేసీ రాజశేఖర్‌ సూచించారు. మంగళవారం ఈ అంశంపై సూపరింటెండెంట్‌లతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. 

Updated Date - 2022-02-23T07:00:57+05:30 IST