కళ్యాణమస్తు ఎగవేతకే పది పాస్‌ నిబంధన: పనబాక

ABN , First Publish Date - 2022-09-14T05:02:02+05:30 IST

కళ్యాణమస్తు పథకానికి 10వ తరగతి పాస్‌ కావడమనే నిబంధన పెట్టడం పథకం ఎగవేతకేనని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు.

కళ్యాణమస్తు ఎగవేతకే పది పాస్‌ నిబంధన: పనబాక
పేదలకు అన్నదానం చేస్తున్న టీడీపీ నేతలు

పెళ్లకూరు, సెప్టెంబరు 13 : కళ్యాణమస్తు పథకానికి 10వ తరగతి పాస్‌ కావడమనే నిబంధన పెట్టడం పథకం ఎగవేతకేనని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి  ఆరోపించారు. మంగళవారం కొత్తూ రు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియో జకవర్గ స్థాయి బూత్‌కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. చంద్రబాబు   చం ద్రన్న పెళ్లికానుక ద్వారా 83,081 మంది పేదలకు పెళ్లికానుక అందించారని గుర్తుచేశారు. జగన్‌ 10,391 మందికే ఇచ్చారని వివరించారు. తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్‌, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ వైఫ ల్యాలను  ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు టీడీపీ ఓట్లను తొలగించే యత్నంలో ఉన్నారని ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం అన్న క్యాంటీన్‌ ఏర్పాటుచేసి పేదలకు అన్నదానం నిర్వ హించారు. జిల్లా ఉపాధ్యక్షుడు రఘునాథరెడ్డి, తిరుమూరు సుధాకర్‌రెడ్డి, నాయకులు పేరంశెట్టి శ్రీరామ్‌ప్రసాద్‌, సుధీర్‌, కృష్ణారెడ్డి, గిరి,  రాజేంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు   కృష్ణయ్య,   నాగేంద్ర ప్రసాద్‌రెడ్డి, శేఖర్‌నాయుడు, గోపాల్‌రెడ్డి, వెంక టేశ్వర్లు, రమణయ్య, పరుశురామ్‌ ఉన్నారు. 

Read more