గ్రామ స్వరాజ్యం తెచ్చిన జగన్‌: చెవిరెడ్డి

ABN , First Publish Date - 2022-03-16T08:48:51+05:30 IST

రైతు భరోసాతో వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో రైతు రాజ్యం తెచ్చాడని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.

గ్రామ స్వరాజ్యం తెచ్చిన జగన్‌: చెవిరెడ్డి

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రైతు భరోసాతో వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో రైతు రాజ్యం తెచ్చాడని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయనికి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తూ, పట్టాలు ఇస్తూ పేదలకు పట్టాభిషేకం చేస్తున్నారన్నారు. పిల్లల్లో పోషకాహారం లోపం లేకుండా గోరుముద్ద పథకం తెచ్చి చిన్నారులకు మేనమామగా నిలిచారన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా అమ్మఒడి అమలుచేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాలతో గ్రామాల్లోనే అన్ని సేవలు అందిస్తూ నిజమైన గ్రామస్వరాజ్యం తెచ్చారన్నారు. పేదలను దారిద్య్రం నుంచి పైకి తీసుకొచ్చి అందరూ సముచిత స్థానాల్లో ఉండాలనే లక్ష్యంతో బడ్జెట్‌ రూపొందించారని చెప్పారు.

Read more