Cheddi gang: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ కలకలం

ABN , First Publish Date - 2022-09-07T17:16:20+05:30 IST

నగరంలోని తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ కలకలం రేగింది.

Cheddi gang: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ కలకలం

తిరుపతి: నగరంలోని తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ (Cheddi gang) కలకలం రేగింది. బృందావన కాలనీలో ప్రహరీ గోడ దూకి ఓ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు చోరీకి తెగబడ్డారు. చెడ్డీ గ్యాంగ్‌లోని ఒకడు చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని తచ్చాడుతున్న వైనం భయాందోళనకు గురి చేసింది. చడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో తిరుచానూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. చడ్డీగ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-09-07T17:16:20+05:30 IST