బాబు హయాంలో పనులకు మళ్లీ మళ్లీ తనిఖీలా?

ABN , First Publish Date - 2022-04-10T08:35:04+05:30 IST

మూడేళ్ల కిందట టీడీపీ అధినే త చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులను మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తూ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వేధిస్తున్నారని..

బాబు హయాంలో పనులకు మళ్లీ మళ్లీ తనిఖీలా?

పీఆర్‌ ఇంజనీర్స్‌ సంఘం ఆందోళన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మూడేళ్ల కిందట టీడీపీ అధినే త చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులను మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తూ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వేధిస్తున్నారని.. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీ మురళీకృష్ణనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం విశాఖలోని పీఆర్‌ ఇంజనీరింగ్‌ ఆఫీసులో సంఘం రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా మురళీకృష్ణనాయుడు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం, రాష్ట్ర అభివృద్ధి ఫండ్‌ నిధులతో మూడేళ్ల కిందట అనేక పనులు చేపట్టినట్టు తెలిపారు. పనులకు సంబంధించి ఒకసారి నాణ్యత తనిఖీ చేశారని, ఇప్పుడు అవే పనులకు మళ్లీ తనిఖీలు చేస్తామంటున్నారని.. ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తనిఖీలకు వచ్చిన విజిలెన్స్‌ అధికారులు పలు విధాల వేధిస్తుండడంతో ఇంజనీర్లు తీవ్ర ఒత్తిడి, మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే విజిలెన్స్‌ తనిఖీలు ఆపాలని డిమాండ్‌ చేశారు. 

Read more