AP News: ఏపీలో అన్ని పథకాలకు కోతలు పెడుతున్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-09-03T01:17:33+05:30 IST

ఏపీలో అన్ని పథకాలకు కోతలు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు.

AP News: ఏపీలో అన్ని పథకాలకు కోతలు పెడుతున్నారు: చంద్రబాబు

అమరావతి: ఏపీలో అన్ని పథకాలకు కోతలు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP) 95% హామీలు నెరవేర్చడం కాదు.. 95% ఏపీని లూటీ చేసిందని ధ్వజమెత్తారు. పెన్షన్‌పై వైసీపీ సర్కార్‌ హామీ ఏమయ్యింది? అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్‌లు (Anna canteens) మూసేశారు.. అన్నం పెడుతుంటే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. స్కూళ్ల విలీనం పేరుతో పాఠశాలలు మూసివేస్తున్నారని విమర్శించారు. రంజాన్ తోఫా, పెళ్లి కానుక, విదేశీ విద్య పథకాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులను కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారని తప్పుబట్టారు. ఏపీలో మైక్రో ఇరిగేషన్ పోయిందని, రైతుకు దక్కాల్సిన అన్ని సబ్సిడీలు పోయాయని తెలిపారు.


తప్పు చేస్తోన్న పోలీసులపై ప్రైవేట్‌ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ ముసుగులో వచ్చే నేరస్తులకు గట్టి గుణపాఠం చెబుతామని  చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలో మాటలు ఎంత ముఖ్యమో చేతలు కూడా అంతే ముఖ్యమన్నారు. ఇక్కడ మాటలు చెప్పి బయటకెళ్లి పని చేయకపోతే కుదరదన్నారు. నేతలు కూడా పక్కా కార్యాచరణతో పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read more