8 నెలల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-18T08:30:03+05:30 IST

8 నెలల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు

8 నెలల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు

రాష్ట్రపతి ఎన్నికల కోసం నేడు శాసనసభకు

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి రానున్నారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇప్పుడూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదని, కేవలం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి వెనుదిరుగుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 

Read more