చంద్రబాబు నెల్లూరు పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2022-09-10T08:55:28+05:30 IST

నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 14 నుంచి 16 వరకూ బాబు నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.

చంద్రబాబు నెల్లూరు పర్యటన వాయిదా

నెల్లూరు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 14 నుంచి 16 వరకూ బాబు నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. మొదటి రోజు మినీ మహానాడు, రెండో రోజు నియోజకవర్గాల వారీ సమీక్ష, చివరి రోజు రోడ్‌ షో చేయాలని నిర్ణయించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో కార్యక్రమం వాయిదాపడింది.

Read more