కృష్ణ, మహేష్బాబును ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-09-30T02:32:56+05:30 IST

సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్బాబును టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ఇందిరాదేవి మరణంతో కృష్ణ..

కృష్ణ, మహేష్బాబును ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు

అమరావతి: సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్బాబును టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ఇందిరాదేవి మరణంతో కృష్ణ, మహేష్బాబు విషాదంలో ఉన్నారు. ఇందిరాదేవి మృతి పట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు. కృష్ణ సతీమణి ఇందిరా దేవి (70) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆమె బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు. ఇందిరా దేవి తన చిన్నకుమార్తె ప్రియదర్శిని, అల్లుడు సుధీర్‌బాబుల దగ్గర ఉంటున్నారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతుల పెద్ద కుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి నెలలో కన్నుమూసిన సంగతి విదితమే. ఆ విషాద సంఘటన జరిగిన ఎనిమిది నెలలకే ఇందిరా దేవి కన్నుమూయడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Read more