ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-16T22:51:59+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వేధింపులతో అంతటా రౌడీరాజ్యం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వేధింపులతో అంతటా రౌడీరాజ్యం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీతో పాటు జఎస్టీ (జగన్ ట్యాక్స్) అదనంగా కట్టాల్సి వస్తోందన్నారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారని కొనియాడారు. ఆర్థిక మంత్రి అంటే రోశయ్య పేరు గుర్తుకు వస్తుందన్నారు. రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో ఆయన పేరు ఎందుకు పెట్టరు? అని చంద్రబాబు  ప్రశ్నించారు. రోశయ్యకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్‌కు మనసు రాలేదని తప్పుబట్టారు. మాజీ సీఎంలు వెంగళరావు, విజయభాస్కర్‌రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టి గౌరవించామని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొణిజేటి రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని చంద్రబాబు తెలిపారు. 

Read more