మోడీ వచ్చాక ఈశాన్య రాష్ట్రాలకు జీవం వచ్చింది: సర్భానంద్

ABN , First Publish Date - 2022-02-24T03:32:01+05:30 IST

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ దేశంలోనే పెద్ద పొర్టుల్లో ఒకటి అని మంచి సౌకర్యాలు కలిగి ఉందని కేంద్రమంత్రి సర్భానంద్ సోనో అన్నారు. పోర్ట్ కనెక్టివిటీ..

మోడీ వచ్చాక ఈశాన్య రాష్ట్రాలకు జీవం వచ్చింది: సర్భానంద్

విశాఖ: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ దేశంలోనే పెద్ద పొర్టుల్లో ఒకటి అని మంచి సౌకర్యాలు కలిగి ఉందని  కేంద్రమంత్రి సర్భానంద్ సోనోవాల్ అన్నారు. పోర్ట్ కనెక్టివిటీ పెంచుతున్నామని,  దేశ ఆర్థిక అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెట్టామని, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశాభివృద్ధి ముందుకు వెళుతుందన్నారు. 2030నాటికి గతి శక్తి ద్వారా వంద లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావాలనే ఆలోచన ఉందని సర్భానంద్ సోనో తెలిపారు. ‘‘2005లో పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యుడిగా ఉన్నపుడు విశాఖ వచ్చాను. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. ప్రజా సేవకు అంకితమవుతామని పార్టీ ఆవిర్భావంలోనే ప్రతిజ్ఞ చేసింది‌‌. దేశాన్ని స్వావలంబని దశగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం. పార్టీలో అందరూ సమానమే.. అవకాశాలు సమానంగా అందరికీ కల్పించే పార్టీ. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. మోడీ ప్రధానిగా వచ్చాక ఈశాన్య రాష్ట్రాలకు జీవం వచ్చింది. వనరులు సమృద్దిగా అందించడంలో ఇతర రాష్ట్రాలతో సమాన అవకాశాలు కల్పించారు.’’ అని కేంద్రమంత్రి సర్భానంద్ సోనోవాల్ తెలిపారు. 

Read more