ప్లాంట్‌ ప్రొటెక్షన్‌అధికారిపై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2022-09-10T08:58:54+05:30 IST

విశాఖలోని ప్లాంట్‌ క్వారంటైన్‌ స్టేషన్‌లో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పదమ్‌సింగ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్లాంట్‌ ప్రొటెక్షన్‌అధికారిపై సీబీఐ కేసు

ఆదాయానికి మించి ఆస్తులున్నాయని అభియోగం

విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని ప్లాంట్‌ క్వారంటైన్‌ స్టేషన్‌లో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పదమ్‌సింగ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  పోర్టు నుంచి జరిగే వస్తువుల దిగుమతి, ఎగుమతులకు సంబంధించి ప్లాంట్‌ క్వారంటైన్‌ స్టేషన్‌ నుంచి కస్టమ్స్‌ రిలీజ్‌ సర్టిఫికెట్‌ జారీకి పదమ్‌సింగ్‌ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు సీబీఐ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జూలై 15న వేరొకరి నుంచి లంచం తీసుకుంటుండగా పదమ్‌సింగ్‌ను అరెస్టుచేశారు. అనంతరం ఆయన కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు 2020 డిసెంబరు 2 నుంచి ఈ ఏడాది జూలై 15 వరకూ పదమ్‌సింగ్‌ రూ.1,98,22,794 విలువైన ఆస్తులను కూడగట్టినట్టు గుర్తించారు.

Updated Date - 2022-09-10T08:58:54+05:30 IST