పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-21T02:20:32+05:30 IST

తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు, నవంబరు 20: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండువగా జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.45 గంటలకు మిథున లగ్నంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ఊంజల్‌ సేవ, రాత్రికి చిన్నశేష వాహన సేవ జరిగాయి.

Updated Date - 2022-11-21T02:20:32+05:30 IST

Read more