రాష్ట్రంలో ఒక కుట్ర జరుగుతోంది: బొత్స

ABN , First Publish Date - 2022-05-18T21:57:40+05:30 IST

రాష్ట్రంలో ఒక కుట్ర జరుగుతోంది: బొత్స

రాష్ట్రంలో ఒక కుట్ర జరుగుతోంది: బొత్స

విజయనగరం: పార్టీని  మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులకు, జిల్లా మంత్రులకు వుందని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యకలాపాలు జరగబట్టే  అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అధికారులు నిర్వహించాలని చెప్పారు. రెండోసారి అధికారంలోకి రావడం కోసం మొదటిసారి ఎన్నికైన ప్రతి నాయకుడు కష్టపడాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అధిష్టానం వద్ద గుర్తుంపు ఉంది వారికే పార్టీ పదవులని పేర్కొన్నారు. అలాగే రేపటి నుంచి లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లింపులు జరుగుతాయన్నారు. ఎన్.ఆర్.జిఎస్ నిధుల బకాయిలను ఈ నెల ఆఖరిలోగా ప్రభుత్వం  విడుదల చేస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో ఒక కుట్ర జరుగుతోందని,  బలహీన వర్గాలను అనిచెందుకు ప్రతి పక్షం పావులు కదుపుతోందన్నారు. 

Read more