విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-25T00:35:39+05:30 IST

విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

విష్ణుకుమార్ రాజు  సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక నియంతన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ ఎట్టిపరిస్థితుల్లోను అధికారంలోకి రారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. జగన్‌కి ఇదే దావోస్ ఆఖరి ట్రిప్ అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ ఏక్సిజ్ డ్యూటీ తగ్గించినా, జగన్ పెట్రోల్, డీజిల్ పైఒక్క రూపాయి తగ్గించక పోవడం ఘోరమని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్యకు నైతిక బాధ్యత వహించి అనంతబాబు కాదని, సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేర చరిత్ర ఉన్నవారంటే జగన్‌కి ఇష్టమని విన్నానని అనంత బాబుని పెద్దల సభకు పంపడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మందిని వైసిపి నేతలు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియాన్ని ఎందుకు ఇవ్వడం లేదో జగన్ చెప్పాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చమని పవన్ అంటే... అప్పటి నుంచి వైసీపీ నేతలకు దడ పట్టుకుందన్నారు. 

Read more