-
-
Home » Andhra Pradesh » BJP State Secretary Nagothu Ramesh Naidu vijayawada andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
BJP Leader: ఏపీలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది
ABN , First Publish Date - 2022-09-30T20:02:08+05:30 IST
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

విజయవాడ: రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Nagothu Ramesh Naidu) అన్నారు. శుక్రవారం ‘‘గంజాయి మాఫియా నుండి రాష్ట్రాన్ని రక్షిద్దాం ! యువతను కాపాడుదాం’’ అంటూ బీజేపీ (BJP) నిర్వహించిన ప్రజాపోరు రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్రగ్ మాఫియా లో అధికార పార్టీ నేతలు ఉన్న కారణంగా నే వైసీపీ ప్రభుత్వం (YCP Government) పట్టించుకోవడం లేదు ఎమ్మెల్సీ ఆనందబాబుకు గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. యువత మత్తుకు బానిస అవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల అండతో గంజాయి రవాణా జరుగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) స్పందించి చర్యలు తీసుకోవాలని నాగోతు రమేష్ నాయుడు(BJP Leader) డిమాండ్ చేశారు.