వైసీపీ తొత్తులుగా ఐపీఎస్‌లు

ABN , First Publish Date - 2022-10-01T09:05:22+05:30 IST

రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని, ఐపీఎ్‌సలు అంటే వైసీపీ అనుకుంటున్నారని బీజేపీ

వైసీపీ తొత్తులుగా ఐపీఎస్‌లు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి


సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), సెప్టెంబరు 30: రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని, ఐపీఎ్‌సలు అంటే వైసీపీ అనుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్థన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజాపోరు యాత్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీ నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 175 సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న సీఎం జగన్‌.. ఏం అభివృద్ధి చేశారని ప్రజలు అన్ని సీట్లు ఇవ్వాలో చెప్పాలన్నారు. 

Read more