-
-
Home » Andhra Pradesh » bjp somuveerraju amaravati vsp-MRGS-AndhraPradesh
-
ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: సోెము వీర్రాజు
ABN , First Publish Date - 2022-10-03T03:41:30+05:30 IST
ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి..

విజయవాడ: ఏపీ అభివృద్ధికి బీజేపీ (Bjp) కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somuveerraju) స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి (Amaravati)ని చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీని ముక్కలు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. కుటుంబ పార్టీల మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఏపీలో అరాచక పాలన తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తారా? అని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.