GVL Comments: 2024లో బీజేపీకి అద్భుత విజయం సొంతం

ABN , First Publish Date - 2022-09-07T18:35:10+05:30 IST

2024లో బీజేపీ అద్భుత విజయం సొంతం చేసుకోనుందని... 400 సీట్లు పైగా గెలుచుకోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ జోస్యం చెప్పారు.

GVL Comments: 2024లో బీజేపీకి అద్భుత విజయం సొంతం

విశాఖపట్నం: 2024లో బీజేపీ(BJP) అద్భుత విజయం సొంతం చేసుకోనుందని... 400 సీట్లు పైగా గెలుచుకోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్(GVL) జోస్యం చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే నవ్యాంధ్ర కల నెరవేరుతుందని తెలిపారు. రాహుల్‌గాంధీ (Rahulgandhi) ఎన్ని పాదయాత్రలు చేసినా కాంగ్రెస్‌కు ఉపయోగం లేదన్నారు. విశాఖ భూ కబ్జాలపై టీడీపీ (TDP), వైసీపీ (YCP) రెండు సిట్‌లు వేశాయని... కానీ ఆ రిపోర్టులను బయటపెట్టడం లేదని అన్నారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.  

Updated Date - 2022-09-07T18:35:10+05:30 IST